Followers

Friday, 27 April 2018

Baahubali 3 - Short Story 3

మహేంద్ర బాహుబలి సారధ్యం లో మాహిష్మతి సామ్రాజ్యం విస్తరించడం మొదలయింది. చుట్టు పక్కల రాజ్యాలన్ని బాహుబలి వీరోచిత పోరాటానికి దాసోహం అయిపోయాయి.

కొడుకుని మనవడ్ని మట్టుబెట్టిన బాహుబలి కి రాజ్యాధికారం దక్కడం చూసి బిజ్జల దేవ తట్టుకోలేకపోయాడు. పైకి మారిపోయినట్టు నటిస్తూనే పగ తీర్చుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

కొత్తగా మహిష్మతి సైన్యం లో దీరుడైన కార్తికేయ ని సైన్యాధ్యక్షుడు గానియమిస్తారు. ఇతనికి యుద్ధ ప్రావీణ్యం తో పాటు రాజ్య పాలన అనే దురాశ కూడా ఎక్కువే. ఇతని సంగతి తెలుసుకున్న బిజ్జల దేవ, మచ్చిక చేసుకుంటాడు. మహేంద్ర బాహుబలి ని అంతమొందిస్తే, మహిష్మతి సింహాసనం కార్తికేయ కి ఇప్పిస్తానని ఆశ పెడతాడు.

ఇలా ఉండగా ఉత్తర దిక్కు నుంచి షేర్ ఖాన్ దండయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు. బాహుబలి ని అంతం చేయాలంటే అది షేర్ ఖాన వల్లే సాధ్యం అని కార్తికేయ నమ్మకం.

ఉదయ్ గఢ్ సామ్రాజ్యం మీద షేర్ ఖాన్ దాడికి సమాయత్తం అవుతున్నాడని వేగు ద్వారా తెలుసుకున్న కార్తికేయ, అతని కన్నా ముందు ఉదయ్ గఢ్ మీద మాహిష్మతీ దాడి చేస్తే అప్పుడు షేర్ ఖాన్ కోపంతో మాహిశ్మతి మీద యుద్ధం ప్రకటిస్తాడు అని ఆలోచిస్తాడు.

సైనికుల తో పాటు కట్టప్ప అడవిలో  వేట కి  వెళ్తా డు. తన వెనుక గానే వెళ్లి సైనికులు ని,
కట్టప్ప నీ చంపేస్తాడు కార్తికేయ. కానీ ఇదంతాఉదయ్ గఢ్ రాజ్యం చేయించిందని బాహుబలి ని నమ్మిస్తాడు.

కట్టప్ప మృతి తో ఉద్రేకం చెందిన బాహుబలి ఉదయ గఢ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఉదయ్ గఢ్ ని జయించడం అంత సులువు కాదు, దానికి కాపలా గా వంద మంది సైనికుల తో సమానమైన కాళ భైరవ ఉంటాడు.

బాహుబలి సైన్యంతో ఉదయ్ గఢ్ మీద యుద్ధానికి బయల్దేరాడు. వారం రోజుల యుద్ధం తర్వాత మహేంద్ర బాహుబలి మరియు కాళ భైరవ ఒకరికి ఒకరు ఎదుట పడతారు. కత్తుల తో ఉత్కంఠ పోరు జరుగుతోంది.

ఇద్దరిలో ఎవరో ఒకరు గెలవబోయే సమయంలో

"పరీక్ష కి చదవకుండా మొద్దు నిద్ర ఏంట్రా అని అమ్మ మొట్టికాయ పెట్టగానే నిద్ర లేచిపోయా."

No comments:

Post a Comment